Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAభూకబ్జాదారుల ఆగడాలను ఆపలేని అధికారుల తీరుకు నిరశనగా ధర్నాకు సిద్ధమవుతున్న 93 ఏళ్ల వృద్ధుడు

భూకబ్జాదారుల ఆగడాలను ఆపలేని అధికారుల తీరుకు నిరశనగా ధర్నాకు సిద్ధమవుతున్న 93 ఏళ్ల వృద్ధుడు

తమ భూమిని ఆక్రమించుకొని ఇబ్బందులకు గురిచేస్తున్న భూ కబ్జాదారుల ఆగడాలను భరించలేక ఈ నెల 12వ తేదీన స్థానిక తహసిల్దార్ ఆఫీస్ వద్ద యూసుఫ్ ఖాన్ అనే 93 ఏళ్ల కురు వ్రృద్ధుడు ధర్నాకు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఈద్గాలో నిర్వహించిన యూసుఫ్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీలు, వివిధ కమిటీలకు చెందిన ముస్లింలు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూసుఫ్ ఖాన్ కుమారుడైన అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ జులై నెల 12వ తేదీన మండల సర్వేయర్ సర్వే ప్రకారం మా హద్దులకు మేము రాళ్లు పాతుకోగా కబ్జాదారులు తొలగించారని ఈ విషయమై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా తగిన చర్యలు తీసుకోకుండా పట్టణ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసుల నిర్లక్ష్యంతో మరింత పేట్రేగిన కబ్జాదారులు ఆ భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తామని భూమిలోకి రానివ్వడం లేదని వారి ఆగడాలకు విసిగిపోయిన తన తండ్రి 93 ఏళ్ల యూసుఫ్ అలీ ఖాన్ ఈ నెల 12వ తేదీన స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారని అన్నారు.

కంకర్ బోడు మసీద్ కు చెందిన మసీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ అదిల్ మాట్లాడుతూ ముస్లింలపై దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా భూకబ్జాదారులుతమ వైఖరి మార్చుకోవాలని ఇది ఒక కుటుంబ సమస్య కాదని మహబూబాబాద్ లోని ప్రతి ముస్లిం సమస్య అని ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు.

ఇస్లేహా మాషిర కమిటీ మహబూబాబాద్ అధ్యక్షులు ఎండి ఇక్బాల్ మాట్లాడుతూ చాలా తేలికగా పరిష్కారం అయ్యే సమస్యను భూకబ్జాదారులు జటిలం చేసుకుంటున్నారని యూసుఫ్ ఖాన్ కుటుంబం ఎలా సర్వే చేసుకున్నారో పక్క వారు కూడా తమ తమ భూములకు సర్వే నిర్వహించుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని మహబూబాబాద్ కు చెందిన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చోరవ తీసుకొని పక్క వారి భూమి కూడా సర్వే చేయించడం వల్ల ఈ సమస్య అతి తేలికగా పరిష్కారం అవుతుందని సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఈ విషయమై సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ నెల 12వ తేదీ నాడు యూసుఫ్ అలీఖాన్ ధర్నా చేయకముందే సమస్య పరిష్కారమైతే అందరికీ బాగుంటుందని 93 ఏళ్ల కురు వ్రృద్ధుడు తన హక్కుల కోసం ధర్నా చేయడం ముస్లిం సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ నాయక్, సయ్యద్ సాదిక్, నిజాం, మక్బూల్, నజీర్, అబ్దుల్ కలీం, యాఖుబ్ పాషా, ముజాఫర్, జియా, ఇంతియాజ్ ఖాన్, మహమ్మద్ అలీఖాన్, అలీమ్, ఫజల్, అన్వర్, ఫెరోజ్, అజీజ్, అజీమ్, సఫర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments