ఆసిఫాబాద్ పట్టణం నందు ఈరోజు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్ర భద్రత బలగాల మార్చ్ ను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఫెమిలైజేషన్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలంతా శాంతియుతంగా, సామరస్యంగా ఉండేందుకు మార్చ్ నిర్వహించామని అన్నారు. త్వరలోఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వర్గ భేదాలు అల్లర్లు లేకుండా ఉండేందుకు జిల్లాలో ఆయా చోట్ల అవగాహన సదస్సులు కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ పట్టణంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎ.ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ నందవార్, ఇన్స్పెక్టర్స్ ప్రధాన్, రమేష్ కుమార్, ఆసిఫాబాద్ టౌన్ సిఐ సతీష్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డి సి ఆర్ పి ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐ లు పెద్దన్న, అంజన్న, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
