Thursday, October 22, 2026
spot_img
HomeANDHRA PRADESHశ్రీ సరస్వతీ విద్యా మందిరంలో శిశు వికాస శిబిరం ముగింపు

శ్రీ సరస్వతీ విద్యా మందిరంలో శిశు వికాస శిబిరం ముగింపు

శ్రీ సరస్వతీ విద్యా మందిరంలో తల్లిదండ్రులకు శిశు వికాస శిబిరం నిర్వహించారు. ఈ సమావేశములో పాఠశాల ప్రధానాచార్యులు కరణం తిరుమల రావు మాట్లాడుతూ అమ్మానాన్నలు, గురువులే చిన్నారులకు ఆదర్శమూర్తులని, విదేశీ సంస్కృతి ప్రభావం కారణంగా జీవన మూల్యాలు క్షీణిస్తున్నాయని, ఈ పరిస్థితులలో జీవన విలువల నిర్మాణమునకు కావలసిన సంస్కారాలను రాబోవు తరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులదేనని, శిశు వికాస శిబిరంలో మూడు నెలలు శిశువులకు ఆటల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా అందించిన సంస్కారములు వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడేవేనని అన్నారు. పాఠశాల కార్యదర్శి శ్రీ రామమోహనగుప్త మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల వికాసానికి అవసరమైన అన్ని వ్యవస్థలు కల్పించామని, విలువలతో కూడిన విద్యా బోధన శ్రీ సరస్వతీ విద్యా మందిరం పాఠశాలలో నేర్పబడునని అన్నారు. సహకార్యదర్శి శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ పిల్లలలో అనుకరణ శక్తి ఉంటుందని, వారు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారని కావున ముందు తల్లిదండ్రులు కూడా ఆదర్శంగా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments