జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు , ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్ , సింగల్ విండో చైర్మన్ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అలీ బీన్ అహ్మద్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ లు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని మీడియా రంగాన్ని విస్మరిస్తున్న వైఖరికి నిరసనగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జర్నలిస్ట్ డిమాండ్స్ డే నాడు శనివారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జర్నలిస్టుల ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అంతకముందు షహీద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియా రంగంలో డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన నేపథ్యంలో కొత్తగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రత, స్వేచ్ఛ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మీడియాను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం సబబు కాదని వెంటనే జర్నలిస్టుల ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ఆడప సతీష్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ లు దేవునూరి రమేష్, బొజ్జ మహేష్, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బిక్కాజి, రమేష్, జిల్లా నాయకులు సురేష్ చారి, వారణాసి శ్రీనివాస్, అమూల్ గౌడ్, హరికృష్ణ, రాధాకృష్ణ చారి, నాగరాజ్, జర్నలిస్టులు రవి, సమీర్, శ్రీనివాస్, తిరుపతి, మున్నా, కృష్ణపల్లిసురేష్. జిల్లాలోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు