రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకి చెందిన ఉపాధ్యాయుడు ఎనగందుల దేవరాజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాన్ని వీడి బీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంలో బుధవారం బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేష్ ఆధ్వర్యంలో చేరారు. బిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఎనగందుల దేవరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మల్లేశం, జిల్లా జనరల్ సెక్రెటరీ కర్రోళ్ల రాజలింగం, జిల్లా ఉపాధ్యక్షుడు బావికాడి రామచంద్రం, అంజన్న, విశ్వనాథం, మధు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు