రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లికి చెందిన బొల్లారం ఎల్లయ్య యాదవ్ (51) అనే గొర్రెల కాపరి గురువారం నాలుగున్నర గంటల ప్రాంతంలో తిమ్మాపూర్ శివారులోని జాల కింద ఏరియాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం లో పిడుగు పడింది. ఈ సంఘటనలో ఆయన పిడుగుపాటుకు గురి అయ్యాడు, ఎల్లయ్య చాతిలో ఎడమ భాగం కాలి పోయి అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోగా ఆయనను సమీపంలో ఉన్న రైతులు, మాజీ సర్పంచ్ రవి గుప్తా లు కలిసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు, ఆయనకు వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనకు భార్య రేణుక, కూతురు శిరీషా, కుమారుడు శ్రీనివాసు లు ఉన్నారు