రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులు పరిశీలించారు. పోలీస్ పెండింగ్ కేసు వివరాలు తెలుసుకొని త్వరగా వాటిని పూర్తి చెయ్యాలని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయో అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని అన్నారు.