రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో WJI వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నూతన కమిటీని ఆదివారం స్థానిక జీకే ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ముస్తాబాద్ WJI ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు గా మేకర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కరెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి, కోశాధికారిగా ఎరుపుల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా WJI రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ మరియు WJI రాష్ట్ర కార్యదర్శి శివనాత్రి ప్రమోద్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగనుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై అక్రమంగా కేసులు పెడుతుంటే ఆదుకోవాల్సిన అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులందరికి ఇండ్లు,హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి వాటి మరిచిపోయారంటు ఎద్దేవా చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ వర్కింగ్ జర్నలిస్ట్ ల విషయంలో తాత్సారం చేయడం సమంజసం కాదన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులపై అనవసరంగా కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఇంచార్జి గంగు సతీష్, గౌరవ అధ్యక్షులు అబ్రమేని దేవేందర్, గౌరవ సలహాదారులు కర్ణాల శ్రీశైలం, లింగంపల్లి రాజేష్, కొల్లూరి సంతోష్,దుబ్బాక శ్రీనివాస్ లు పాల్గొన్నారు.