సిడ్నీ: టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకుమార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మిస్టర్ 360’ ఆటను కోహ్లీ, విలియమ్సన్, ఫిలిప్స్, హార్దిక్ పాండ్యా అద్భుతమని పొగిడారు. అసాధారణమైన షాట్లతో చెలరేగిపోయే ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా.. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో సూర్య విస్ఫోటనాన్ని చూసి నోరెళ్లబెట్టాడు. ‘స్కోరు బోర్డును చూసిన వెంటనే ఆ స్ర్కీన్ షాట్‌ను ఫించ్‌కు పంపి.. అసలేం జరుగుతోంది? అని అడిగా. ఇతడు వేరే గ్రహం నుంచి వచ్చాడా ఏంటి? మిగతా వాళ్ల స్కోర్లకు.. సూర్య 50 బంతుల్లో 111 పరుగులకు ఏమైనా పోలికుందా?’ అని ప్యాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మ్యాక్సీ చెప్పాడు.