ముస్లింలలో ఆర్ధికంగా అతి పేదవారికి ఉపయోగపడేలా 20 ఏళ్ల క్రితం వచ్చిన రిజర్వేషన్ల ఫలాలు ఇప్పటికి తమకు అందడం లేదని తమపిల్లలకు చదువుకునేందుకు ఉపాధి పొందేందుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని అందుకు కారణం తమకు కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా మండలాధికారులు నిరాకరించడమే కారణమని తమకు కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలంటూ ముస్లింలలో అత్యంత వెనుకబడిన పేదవారి హక్కులకై పోరాడుతున్న తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నాయకులు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈసందర్భముగా మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లల భవిష్యత్తు కులధ్రువీకరణ పత్రంతో ముడిపడి ఉందని సంఘం కోశాధికారి మహమ్మద్ యాకుబ్ చేసిన వ్యాఖ్యలు 10వ తరగతి పాసైన 16ఏళ్ళ ఒక చిన్నారి సర్హాం లో చైతన్యం తెచ్చింది.
ఆ పిల్లాడి సోదరి సానియా ఇటీవల జరిగిన ఎంసెట్ పరీక్షలలో నర్సింగ్ కోర్సుకు అర్హత సాధించింది కానీ కులధృవీకరణ పత్రం లేకపోవడం వలన సీట్ వస్తుందో లేదో అనే ఆందోళన ఇంటిల్లిపాదికి పెరిగింది ఈ నేపథ్యంలో చిన్నపిల్లాడు సర్హాం ఎంతో ధైర్యంతో మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీలను ఇటీవల ప్రజావాణిలో తమ నాయకుడు మహమ్మద్ యాకుబ్ మీడియాతో మాట్లాడిన వీడియో చూపించి తమకు కులధ్రువీకరణ పత్రం జారీచేయాలని కోరడంతో మండల తహసీల్దారు అక్క తమ్ముళ్లకు కులధ్రువీకరణ పత్రాలు జారీచేయడం మండలంలో సంచలం సృష్టించింది.
ఇన్నాళ్లు తమహక్కులు తెలియక తమకు న్యాయంగా రావాల్సిన సౌకర్యాలు పొందలేక చదువుకు దూరమై సరైన ఉపాధిలేక నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ముస్లింలలో అత్యంత వెనకపడిన 14 తెగల సంచార ముస్లింలకు దక్కాల్సిన హక్కులకోసం పోరాడుతున్న తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, రాష్ట్ర కోశాధికారి మహమ్మద్ యాకుబ్ ఇతర రాష్ట్ర నాయకత్వం చేస్తున్న అలుపెరగని పోరాటం ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సంచార ముస్లింలలో ఎంత అణగదొక్కితే అంతపైకి లేచిన బంతిలా తమ హక్కుల సాధన కోసం పోరాడే స్ఫూర్తిని రగిలించింది. నేడు 16 ఏళ్ల బాలుడు తన న్యాయపరమైన హక్కును సాధించుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఇదే పోరాట స్ఫూర్తితో ముస్లిం సమాజం ఇకరికొకరు తోడు అన్నట్లు నిలబడితే సామాజికంగా, విద్య, ఉపాధి రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. 18 ఏళ్లుగా కులధ్రువీకరణ పత్రం పొందడంలో పడ్డ ఇబ్బందులు త్వరలోనే పూర్తిగా తొలగుతాయని BC E కులధ్రువీకరణ పత్రం అంటే కేవలం ఒక్క షేక్ అనే పరిస్థితి పోయి 14 తెగల వారికి వారి తెగను బట్టి కులధ్రువీకరణ పత్రం సునాయాసంగా పొందే రోజు రావాలని సంచార ముస్లింల జీవితాలను మెరుగు పరిచేందుకు వారి జీవితాలలో మార్పు తెచ్చేందుకు జీవన స్థితిగతులను మార్చి విద్య, ఉపాది, సామాజిక అభ్యున్నతికై పోరాడుతున్న తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆ దిశగా మరింత బలమైన ప్రయత్నాలు చెయ్యాలని వారి పర్యటనలు సఫలమై అత్యంత దుర్భర దారిద్య్ర స్థితిలో ఉన్న సంచార ముస్లింల జీవన స్థితిగతులు మెరుగు పడాలని ఇంక్విలాబ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నాయకులు పఠాన్ సైదాఖాన్, మహమ్మద్ యాకూబ్ లకు అభినందనలు తెలుపుతున్నాము.
![](https://inquilabtv.com/wp-content/uploads/2024/06/R-768x1024.jpeg)