అడ్డగోలు నిబంధనలు, నోటీసులతో పింఛన్ల తొలగింపును ఆపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! అధికారం పీఠం ఎక్కేందుకు పింఛన్ల పెంపు పేరుతో అవ్వా తాతలు, అనాథలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు మీరిచ్చిన హామీలు మరిచిపోయారా? గద్దెనెక్కినప్పటి నుంచి పింఛన్లపై నయవంచనకు దిగారు. రూ. 200 పింఛను మొత్తన్ని టీడీపీ ప్రభుత్వం పది రెట్లు పెంచి రూ.2 వేలు చేసింది. మీరు రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. పెంచాల్సిన పింఛను సొమ్ము పెంచలేదు సరికదా.. ఇప్పుడు అడ్డగోలు నిబంధనలతో రాష్ట్రవ్యాప్తంగా మరో 6 లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు నోటీసులు ఇవ్వడం అన్యాయం. ఆపన్నుల జీవనానికి చేదోడుగా ఉన్న పెన్షన్ కోతతో వారికి గుండెకోత మిగల్చవద్దు. దిక్కుమాలిన నిబంధనలు వెనక్కి తీసుకోండి. పెన్షన్ల రద్దును ఆపండి. రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించండి’’ అని లోకేశ్ తన లేఖలో కోరారు.
అడ్డగోలుగా పింఛన్ల రద్దు ఆపండి: నారా లోకేశ్
RELATED ARTICLES