కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, బోత్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రోడ్‌షో నిర్వహించి, మన రాష్ట్రంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటేసి తనను ఆదరించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో 10 సంవత్సరాల బారాస, కేంద్రంలో 10 సంవత్సరాల బిజెపి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన విధంగానే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని ఒక్క అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు, జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.