తంగళ్ళపల్లి మహిళా ఎంపీపీ ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుకపై చెయ్యెత్తి కోపోద్రిక్తమయ్యింది. ఇరువురి మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ఆదేశాల మేరకు సిరిసిల్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. అందులో భాగంగా ఇద్దరు మహిళ ఎంపీపీల మధ్య ఘర్షణ వాతావరణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.