ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే మానవుడి గుండె చప్పుడు అని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యువకులు అన్నారు. అంబేద్కర్ 133 వ జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలను ప్రపంచ ప్రజానీకానికి తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ త్యాగాలను యాధికి చేసుకున్నారు. ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, సమసమాజ స్వాప్నికులు భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుక మరువలేని తీపి జ్ఞాపకం ఆయన సేవలను ప్రతిక్షణం క్షణం ప్రపంచం గుర్తించుకోవాలన్నారు. అంబేడ్కర్ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత డా.భీమ్‌రావ్ అంబేడ్కర్ జయంతిని ఏటా ఏప్రిల్ 14న నిర్వహించుకుంటున్నామని బాబాసాహెబ్ అని ముద్దుగా పిలువబడే డా.బీఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్‌లకు ఆయన 13వ సంతానం. రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడిగా, ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా అంబేడ్కర్ నిలిచారన్నారు.