Wednesday, January 14, 2026
spot_img
HomeTELANGANAట్రినిటీ కాలేజీ జూనియర్ ఏసీ క్యాంపస్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ట్రినిటీ కాలేజీ జూనియర్ ఏసీ క్యాంపస్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

చైతన్యపురి ట్రినిటీ జూనియర్ కాలేజ్ ఏసీ క్యాంపస్ పై ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీమ్ ఆర్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రయ్య. ఈ కాలేజీకి గ్రౌండ్ లేదని, అర్హులైన బోధనా సిబ్బంది లేరని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, కాలేజీలు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారన్నారు. ఇదే విధంగా వావిలాల పల్లె జూనియర్ కాలేజ్ ట్రినిటీ, ఆల్ ఫోర్స్ కాలేజీ వావిలాల పల్లి, ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఏ కాలేజీ కూడా ప్లే గ్రౌండ్స్ లేవని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా టీచింగ్ స్టాఫ్ లేరని స్టూడెంట్స్ ను బంజేరు దొడ్లకు తోలినట్టు చేయడం వలన వీరి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని కనుక జిల్లా కలెక్టర్ ఇటువంటి కాలేజీలపైన చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవాలని బోయినపల్లి చంద్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. పలుమార్లు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు దరఖాస్తులు ఇచ్చారని ధర్నాలు చేశారని కనుక ఇలాంటి సంఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments