Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకాసారపు శ్రీనివాస్ భూమి పై చిచ్చు తగదు: ముడి మడుగుల మల్లన్న

కాసారపు శ్రీనివాస్ భూమి పై చిచ్చు తగదు: ముడి మడుగుల మల్లన్న

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ శివారులోని సర్వే నం. 300/2 లో మాజీ ఉద్యమ కారుడు కాసారపు శ్రీనివాస్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిపై స్వయాన పెద్ద మనుషులు కక్ష గట్టి చిచ్చులు పెట్టడం తగదని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడి మడుగుల మల్లన్న అన్నారు. సోమవారం ఆయన బాధితుడు కాసారపు శ్రీనివాస్ ను కలిసి అతనికి ప్రభుత్వం భూమి కేటాయించి, హక్కు పత్రాలు జారీ చేసిన భూమిని మోఖా పై పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు దశాబ్ద కాలం క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే శ్రీనివాస్ కు జారీ చేసిన భూమి హక్కు పత్రాలను ఆయనతో పాటు పలువురు పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంత రైతులను, గ్రామస్తులను వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మల్యాల తహశీల్దార్ ను, పోలీస్ అధికారులను, జిల్లా కలెక్టర్ ను స్వయంగా కలిసి కాసారపు శ్రీనివాస్ భూమి విషయంలో ప్రత్యేకంగా చర్చించారు. జిల్లా కలెక్టర్ ను కూడా స్వయంగా కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు పెద్ద మనుషులే కాసారపు శ్రీనివాస్ పై కక్ష గట్టి, దురుద్దేశ్యంతో కావాలనే భూ వివాదాలు సృష్టిస్తున్నారని వారి నిజ నిర్ధారణలో తేలిందన్నారు.

పెద్ద మనుషులు వారి హోదాకు తగినట్లు నీతి – నిజాయితీగా మెదలాలి, వివాదాలు ఉంటే పరిష్కారం చేయాలి, కానీ ఇలా వివాదాలకు కారకులై, సమస్యలు సృష్టించవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా పెద్ద మనుషులు తమ వైఖరి మార్చుకోవాలని కోరారు. లేని పక్షంలో కాసారపు శ్రీనివాస్ కు అండగా ఉండి చట్టబద్దంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. శ్రీనివాస్ పై తప్పుడు కేసులు పెట్టాలనే కుట్రలు, భూమి లాక్కోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి తగు విచారణ జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాసారపు శ్రీనివాస్ కు కేటాయించి భూమికి స్వయంగా అధికారులే హద్దులు నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన భూమి హక్కు పత్రాల ప్రకారం గత ఎనిమిది ఏండ్లుగా శ్రీనివాస్ సాగు చేసుకుంటున్న భూమి అతనికే దక్కేలా చూడాలని కోరారు. మధ్య దళారీలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, కుట్ర పూరిత చర్యలు గ్రహించి వారిపై చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాసారపు శ్రీనివాస్ కు, అతని కుటుంబ సభ్యులకు ఏది జరిగినా తప్పుడు కేసులు బనాయించినా భూమికి ఆటంకాలు సృష్టించినా సంబంధిత అధికారులు, పెద్ద మనుషులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మల్లన్న హెచ్చరించారు. తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, పోనకంటి కైలాసం, నగునూరి చిన్న రామగౌడ్, కొడిమ్యాల రాజన్న, కొమ్ముల మల్లారెడ్డి, ముత్యం నర్సా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments