టిడిపి మేనిఫెస్టోతోనే ఆర్థిక స్వాలంబనలు…
2024లో టిడిపి ఘన విజయం సాధిస్తుంది…
పులివర్తి నానికి ఈసారి అవకాశం ఇవ్వాలంటూ ఇంటింటా ప్రచారం : పులివర్తి సుధారెడ్డి
“మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” బాబుతో నేను కార్యక్రమాన్ని చేపట్టిన పులివర్తి సుధారెడ్డికి టిడిపి, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలుకుతూ జయ జయ ధ్వనులతో ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తించారు.
నారా చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలే మహారాణులుగా రాణించారంటూ తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. ముందుగా పులివర్తి సుధారెడ్డికి టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేలుస్తూ ఎర్రావారిపాలెం గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు. శనివారం పులివర్తి సుధారెడ్డి ఎర్రవారిపాలెం మండలంలోని నెరబైలు పంచాయతీలో “బాబుతో నేను” అనే నినాదంతో “మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని” కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చేపట్టబోయే అధికార ప్రభుత్వంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి నెలకు 1500 రూపాయలు ఆర్థిక చేయూతగాను, ప్రతి బిడ్డ చదువుకు అమ్మకు వందనం పేరిట ఆర్థిక సహాయాన్ని అందించడం, పూర్ టూ రిచ్ వంటి ఆదరణ పథకాలతో ప్రతి ఇంటా ఆర్థిక వెలుగులు విరబూస్తాయని ఆమె తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో టిడిపి ఘన విజయం సాధిస్తుందని ఆమె తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టిడిపికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్రేనని ఆమె ప్రజలకు విన్నవించారు. కురుక్షేత్ర యుద్దాన్ని తలపించే ఈ ఎన్నికలకు ప్రజల మద్దతు టిడిపి పార్టీకే ఉండాలని కోరుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పులివర్తి నానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆమె ఇంటింటా ప్రచారం చేయడంతో ప్రజలు స్వచ్ఛందంగా తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు తెలిపారు. మీ కష్టసుఖాలల్లో తోడు నీడగా ఉంటానని ఆమె హామీ ఇవ్వడంతో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండుకుంది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.