సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్వ్కేర్’ తెరకెక్కుతుంది. సిద్థూ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయినగా నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సిద్ధూ ఒడిలో కూర్చున అనుపమా లుక్ టూ హాట్‌గా కనిపిస్తోంది. ఇంతకు ముందు విడుదల చేసిన గ్లింప్స్‌లో హాట్‌గా కనిపించిన అనుపమను చూసి గ్లామర్ డోస్ పెంచిందే అని కామెంట్స్ వినిపించాయి. తాజా స్టిల్ చూస్తే అంతకుమించి అనేలా ఉంది.
ఇలా వద్దంటూ అభిమానులు కామెంట్స్…
ఇప్పటి దాకా అనుపమా.. గ్లామర్‌కి దూరంగా పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే కనిపించింది. టిల్లు స్వ్కేర్ చిత్రం కోసం గ్లామర్ డోస్ పెంచింది. హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. దీనిపై ఆమెను అభిమానించే వారు అనుపమా ఏంటిది.. నిన్ను ఇలా చూడలేం మేము’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సితారా ఎంటర్‌టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.