ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎటువంటి పక్షపాతం లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలను సక్రమంగా కాపాడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏసిపి రమేష్, తిరుమలగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కార్ఖానా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, బొల్లారం సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.