మార్చ్ 3వ తేదీ 2024 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా గంగాధరలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ నేతృత్వంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సర్వ సభ్య సమావేశంలో కరీంనగర్ జిల్లా సభ్యులంతా ఏకగ్రీవంగా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా మహమ్మద్ పాషా, ఉపాధ్యక్షులుగా సయ్యద్ హాజీ హుస్సేన్, మహమ్మద్ జాఫర్, షేక్ రఫీఖ్, కార్యదర్శి గా మహమ్మద్ నజీర్ హుస్సేన్, సహాయ కార్యదర్శులుగా షేక్ గౌస్, మహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా మహమ్మద్ సలాం, జిల్లా కార్యవర్గ సభ్యులుగా షేక్ సలా, షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ మదార్, మహమ్మద్ సత్తార్, షేక్ ఉస్మాన్,మహమ్మద్ చాంద్, మహమ్మద్ ఖాసీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ చాంద్ పాషా, కోశాధికారి మహమ్మద్ యాకుబ్, ప్రచార కార్యదర్శి షేక్ కరీం, రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు షేక్ కరీం, సయ్యద్ అబ్దుల్ అజీజ్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ బాబు మియా, కరీంనగర్ జిల్లాలోని నాలుగు మండలాల సంచార ముస్లిం సోదరులు పాల్గొన్నారు.