Tuesday, October 20, 2026
spot_img
HomeCINEMAకోరిక తీరింది!

కోరిక తీరింది!

గత ఏడాది ‘ఎఫ్‌3’ చిత్రంతో వినోదాన్ని పంచిన తమన్నా. తర్వాత బాలీవుడ్‌లో ‘బబ్లీ బౌన్సర్‌’, ప్లాన్‌ .. ప్లాన్‌బి’, తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేకపోయాయి. అయినప్పటికీ అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్‌’ సినిమాలో చిరంజీవితో, ‘‘జైలర్‌’లో రజనీకాంత్‌తో కలిసి నటిస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా.. మాట్లాడుతూ ‘‘రజనీకాంత్‌గారితో పని చేస్తానని ఊహించలేదు. ఆయనతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలని నాలాంటి ఎంతోమంది నటీమణులు కోరుకుంటారు. ‘జైలర్‌’ సినిమాతో నా కోరిక తీరుతుంది. కన్న కల నిజం కానుంది. ఆయన్ని సెట్‌లో చూసే రోజు కోసం ఎదురుచూశా. అలాగే చిరంజీవిగారితో కలిసి నేను ‘సైరా నరసింహారెడ్డి’లో నటించాను. మళ్లీ ‘భోళా శంకర్‌’తో మరోసారి అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి కాలు కదపడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని తమన్నా అన్నారు. హిందీలో ఆమె నటించిన ‘బోల్‌ చుడీయా’ చిత్రం డిలే అవుతూనే ఉంది. మలయాళంలో ‘బాంద్రా’ చిత్రంలో నటిస్తోంది. పలు వెబ్‌సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments