తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి. అన్న ఆపద అనగానే ముందుకు వచ్చే వెంకటరెడ్డి. అందరూ వెంకన్న అని ఆప్యాయంగా పిలిస్తే వస్తాడు తను నమ్ముకున్న వాళ్ళకు అండగా నిలుస్తాడు, ఆపద వస్తే ఆయుధమై గర్జిస్తాడు. అతనే వెంకన్న. ఎల్లారెడ్డిపేట తాజా మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి సోమవారం గడ్డం జితేందర్ తండ్రి మరణించగా తెలిసిన వెంటనే హుటాహుటిన వచ్చి ధైర్యం చెప్పి ఇంటి వద్ద నుండి పాడేను మోసి వరకు కట్టె కాలే వరకు ఉండి అంత్యక్రియలు నిర్వహించారు. నా ప్రజలకు నేను ఉన్నాను భయపడకండి అంటూ యువతకు ధైర్యాన్ని నింపారు. అవసరాలకు వాడుకునే నాయకులు ఉన్న రోజుల్లో ఆపదలో ఆదుకునే నాయకుడు ఉండడం ఎల్లారెడ్డిపేట ప్రజల అదృష్టమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.