కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా టీఎజిఎస్ ప్రెసిడెంట్ కోరేంగా మాలశ్రీ శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రైతు ప్రజలందరూ ఎప్పుడైనా పత్తి విత్తనాలు గ్రోమోర్ లోనే పత్తివిత్తనాలు తీసుకోవాలన్నారు. ఎందుకు ఒకే పేరుతో బైట షాప్ లలో లక్షల వరకు విత్తనాలు దొరుకుతున్నాయని తెలిపారు. అనుకూలంగా అందుబాటులో ఉండే ధరతో గ్రోమోర్ లో తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.