రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన కొమిరిశెట్టి రామచంద్రం రైతుకు చెందిన మూడు ఆవులు తన షెడ్డులో ఉండగా శుక్రవారం అర్ధరాత్రి పెద్దపులి ఆవులపై దాడి చేస్తుండగా ఒక్క ఆవు తప్పించుకోగా రెండు ఆవులు అక్కడికక్కడే దుర్మరణం చెందాయి. శనివారం అటుగా వెళుతున్న రైతులు చూసి సమాచారాన్ని రైతుకు అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని కన్నీరు పెట్టుకున్నాడు. గ్రామానికి అడవి సమీపంలో ఉండడం మూలాన ప్రాణాపాయం తప్పినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా రామచంద్రంకు నష్టపరిహారం అందేలా చూడాలని పలువురు కోరారు. అధికారులు అడవి ప్రాంతంపై దృష్టి సారించి పులులను పట్టుకోవాలని సూచించారు.