భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఓ కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై నరేంద్ర మోడీని కార్వింగ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేటకి చెందిన కార్వింగ్ కళాకారుడు, ఆర్టిస్టు శ్యామంతుల అనిల్ పుచ్చకాయపై 30 నిమిషాల వ్యవధిలో నరేంద్ర మోడీని చెక్కానని పేర్కొన్నారు. గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా పుచ్చకాయపై కార్వింగ్ చేశానని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిమలతో పాటు, మహనీయులు మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను కూడా కార్వింగ్ చేసారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భంగా రామ మందిరాన్ని, శివరాత్రి పండుగ సందర్భంగా శివున్ని, వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని, క్రిస్మస్ వేడుక సందర్భంగా శాంతా క్లాస్, భారత జవాన్ అభినందన్, క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఇలా అనేక చిత్రాలను పుచ్చకాయ, గుమ్మడికాయ పై చిత్రాలను కార్వింగ్ చేయడంతో అందరి ప్రశంసలు పొందుత్తున్నాడు .