ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీలో అంబేడ్కర్ నగర్ వాసుల కోసం, గౌడ కులస్తుల కోసం మొత్తం రెండు స్మశాన వాటికల నిర్మాణం కోసం అదే విధంగా కిషన్ దాస్ పేటలో, శ్రీ లక్ష్మి కేశవ పెరమండ్ల దేవస్థానం వద్ద, గిద్దే చెరువు వద్ద నిర్మించిన మూడు స్మశాన వాటికలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆదివారం ఉదయం వేములవాడలో ఆయన నివాసగృహంలో ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ లు కలిసి వినతి పత్రం అందజేశారు. పూర్తయిన స్మశాన వాటికలలో రాత్రి పూట ఎవరైనా చనిపోతే కరెంట్ సౌకర్యం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దాదాపుగా గ్రామంలో అన్ని కుల సంఘాల కు స్మశాన వాటికలు ఉన్నాయని కేవలం అంబేడ్కర్ నగర్ వాసులకు, గౌడ కులస్తులకు స్మశాన వాటికలు లేక అంత్యక్రియలకు ఇబ్బంది అవుతుందనీ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరారు.