జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామానికి చెందిన పార్వతి సాగర్ అను 23 సంవత్సరాల యువకుడు తేదీ 01-04-2024 రోజున జీవితంపై విరక్తి చెంది. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి పార్వతి రాజయ్య. తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడు గతంలో కూడా వ్యాపారం కొరకు తండ్రిని డబ్బులు అడగగా అందుకు తండ్రి నిరాకరించినందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వెంటనే ఒక ప్రైవేటు దవాఖానాలో చికిత్స చేయించిన తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని తిరిగి 01-04 -2024 సోమవారం నాడు తమదైన పొలం వద్దకు వెళ్లి పని చేసుకుందామని తండ్రి తెలుపగా నిరాకరించిన పార్వతి సాగర్ సాయంత్రం వరకు తండ్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు త్రాగగా వెంటనే వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. అప్పటినుండి చికిత్స పొందుతూ 07-04-2024 ఆదివారం రోజున రాత్రి 11 -10 నిమిషాలకు మరణించినాడని తండ్రి పార్వతి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…