చెన్నైకి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ తమ కంపెనీకి రూ.13.83 కోట్ల జీఎ్‌సటీ డిమాండ్ నోటీసుతో పాటు రూ.1.38 కోట్ల పెనాల్టీ నోటీసు జారీ చేసిందని ఏషియన్ పెయింట్స్ సోమవారం వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం రిటర్నుల్లో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ మిస్‌మ్యాచ్‌కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను ట్రిబ్యునల్‌లో సవాలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.