బోయిన్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో తెలంగాణ ప్రగతి సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి వెళ్లి చదువుతోపాటు, ఆటల పోటీల్లో కూడా పాల్గొని, జనరల్ నాలెడ్జ్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి, మీ తల్లిదండ్రులకు ఈ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల గురువులు కూడా కూడా విద్యార్థులకు మంచి విద్యాబోధన, సమాజం పట్ల అవగాహన కల్పించి విద్యార్థులందరినీ మంచి ప్రయోజకులు చేసి సమాజానికి అందివ్వాలని కోరారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్, బలవంత రెడ్డి, నర్సింగ్ ముదిరాజ్, క్రాంతి ముదిరాజ్, సయ్యద్, రియాజ్ ఉద్దిన్, సదా, మారుతి గౌడ్, హరికృష్ణ, ఓం ప్రకాష్, అమీర్, అరుణ్ యాదవ్, శిశుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.