ఈ రోజు జరిగిన ఒక కారు ప్రమాదంలో హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు. ముక్కా కృష్ణమూర్తి. మనవడు. డాక్టర్ నవీన్ స్వాతి. ( ఆర్థోపెడిక్ )ల కుమారుడు ముక్కా నివేష్ 20 సంవత్సరాల విద్యార్థి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుండి మరొక కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముక్కా నివేష్. తో పాటు సహ విద్యార్థి గౌతం అనే విద్యార్థి కూడా మృతి చెందినట్లు ముక్కా నివేష్. తల్లిదండ్రులు ముక్కా నవీన్ స్వాతిలు. తెలిపారు. జరిగిన సంఘటనపై అరిజోనా పోలీసులు సమాచారం అందించడంతో హుజరాబాద్ కు చెందిన ముక్కా ఫ్యామిలీ మెంబర్స్ మరియు డాక్టర్లు అభిమానులు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనపై అరిజోనా పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…