రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సిరిగాధ మనోహర్ (26) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి తను ఉంటున్న గదిలో ఫ్యాన్ కు ఉరి పెట్టుకొని చనిపోయిండు. గమనించిన తల్లిదండ్రులు డెడ్ బాడీని కిందకు దించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం డెడ్ బాడీని స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేటకు బుధవారం తీసుకువచ్చి దహనం చేశారు. మృతునికి తల్లి, తండ్రి, తమ్ముడు ఉన్నారు.

