నవరాత్రుల అనంతరం సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి మున్సిపల్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారని వినాయకుడి నిమజ్జనం రోజున ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం నుండి మెయిన్ రోడ్డు మీదుగా నిమజ్జన ఘట్టాలకు తరలించాలని, ఈ సమయంలో మండపాల వద్ద నుండి వినాయకుడిని తరలించే క్రమంలో కరెంటు వైర్లు డిష్ వైర్లు తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని క్రమంలో ఏదైనా ఇబ్బంది జరిగితే సంబంధిత అధికారులకు లేదా 100 కు డయల్ చేయాలని వెంటనే సంబంధిత అధికారులు స్పందిస్తారని పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు. యువకులు నిమజ్జన సమయంలో మద్యపానాన్ని సేవించరాదని డిజె సౌండ్స్ లాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదని అలా ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిమజ్జన సమయంలో చిన్న పిల్లలను చెరువులకు దూరంగా ఉంచాలని ఏలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జనాన్ని పూర్తిచేయాలని ప్రజలకు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి సూచించారు..