రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన వడ్డే వేముల బాలు ( 35 ) గురువారం రాత్రి 7-40 గంటల ప్రాంతంలో బొప్పాపూర్ నుండి ఎల్లారెడ్డిపేట వైపు ద్విచక్ర వాహనం పల్సర్ పై వెళుతూ డివైడర్ కు కామారెడ్డి నుండి సిరిసిల్ల ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న రాచర్ల గొల్లపల్లి శివారు లోని రెడ్డి మెస్ సమీపంలో అతివేగంగా గుద్దుకొని తల పగిలి స్పాట్ డెడ్ అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు