Friday, July 12, 2024
spot_img
HomeANDHRA PRADESHఅలిపిరి పాదాల మండపం పునర్నిర్మాణంపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

అలిపిరి పాదాల మండపం పునర్నిర్మాణంపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమల: పురాతన మండపాలు శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చెయొచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కూలిపోయే పరిస్థితి ఉంటే జీర్ణోద్దరణ చెయ్యడంతో పాటు భక్తులకు అనువుగా మార్పులు చేయొచ్చన్నారు. దేశంలో చాలా ఆలయాల నిర్మాణాలు టీటీడీలో వేద విద్య అభ్యసించిన విద్యార్థుల సూచన మేరకు నిర్మిస్తున్నారని తెలిపారు. అలాంటిది టీటీడీలో పురాతన మండపాల శిథిలావస్థకు చేరుకుంటే మరమ్మతులు చెయ్యకూడదా అని ప్రశ్నించారు.

అలిపిరి పాదాల మండపం వద్ద శిథిలావస్థకు చేరుకున్న మండపం పునర్నిర్మాణం కోసం ఆర్కాలజీ అఫ్ ఇండియాకు ఇప్పటికే పలు మార్లు లెటర్ రాశామన్నారు. కడప జిల్లా సోమనాథ స్వామి ఆలయంలో గోడ కూలితే మరమ్మత్తుల కోసం ఆర్కాలజీ అఫ్ ఇండియాకు లేఖ రాసినప్పటికీ స్పందన లేదన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో గందరగోళం సృష్టించడం వల్ల అలిపిరి వద్ద మండపం పునర్నిర్మాణం ఆగిందని టీటీడీ ఈవో వెల్లడించారు.

ట్రాప్ కెమెరాలతో జంతు కదలికల గుర్తింపు..

శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా జంతు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రూ.3.5 కోట్లతో ఆధునాతన కెమెరాలను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ కెమెరాల ఏర్పాటుతో జంతు కదలికలను వెంటనే గుర్తించవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments