రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్. బోయినపల్లి గ్రామానికి చెందిన పెంజర్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా వేములవాడ పరిధిలోని కోనయ్యపల్లి గ్రామంలో ఆఫీస్ పెట్టుకొని ఉపాధి ఉద్యోగాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపుతానని లక్షల కొలది డబ్బులు తీసుకుని పంపకుండా మోసానికి పాల్పడుతున్నాడని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కేసు నమోదు చేసి, మోసం చేస్తున్నటువంటి ఏజెంట్ ను రిమాండ్ చేసినట్లు తెలిపారు.