కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జర్ మండలంలోని ఉట్ సారంగపల్లి గ్రామపంచాయతీ మద్దిగూడ నివాసి ఆత్రం బాపు /నిలుబాబా బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ధ్రువీకరించినందున బెజ్జర్ ఎంపీడీఓ ఇతని వృద్దాప్య పెన్షన్ తొలగించారు. ఈ విషయం పై ఎంపీడీఓ మీడియా వివరణ అడుగగా అది కార్యదర్శి పొరపాటు అని తెలిపారు. కార్యదర్శిని వివరణ కోరగా నేను ఎంపీడీఓ కు వాట్సాప్ ద్వారా తెలియ జేశాను అని తెలిపారు. ఇద్దరు అధికారుల తప్పిదం వల్ల పెన్షనుదారు ఆత్రం బాపు నష్టపోయాడు. ఈ సమస్య పైఅధికారులకు, ఎంపీడీఓ, కార్యదర్శి, డి ఆర్ డి ఏ అధికారులకి విన్నవించినా గతనాల్గు సంవత్సరాలనుండి కాలయాపన చేస్తున్నారు. కార్యదర్శి పోరపాటున తొలగించినారు. అని ఎంపీడీఓ పై కార్యదర్శి చేప్పినారు. అసలు పెన్షన్ తొలగించాలని పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవటం లేదు. విధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలనీ, లేని యెడల ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తానని ఆత్రం బాపు పేర్కొన్నారు.