ముస్తాబాద్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా పట్టణం మొత్తం చుట్టేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా గత ప్రభుత్వంలో అరి గోసలు పడ్డం ఇప్పుడు ఉచిత కరెంటుతో 500 కే గ్యాస్ సిలిండర్ తో ఉచిత బస్సు ప్రయాణంతో వడగండ్ల వానకు నష్టపరిహారం అందించడంతో వడ్లు అమ్మిన 48 గంటల్లోనే ఖాతాలో పైసలు న్యూస్ కే పడుతుండటంతో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అని ప్రజలు అంటున్నారన్నారు. ప్రజలే మాకు మద్దతు తెలుపుతూ మీకు మేమున్నాం ఈ ప్రజా పాలన కొనసాగిస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. గత పది యేండ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీని బిజెపి పంచుకోవడంలో మాత్రమే సఫలం అయింది కనీసం విభజన హామీలు అమలు పరచకుండా కాలయాపన చేసిన బిజెపి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన మోడీ నిన్న తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలు అనడం సిగ్గుచేటని ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే తత్వం బిజెపిదని ప్రతిపక్షాల బూటకపు మాటలు నమ్మవద్దు అన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వొరగంటి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్, కో ఆప్షన్ పాపా డైరెక్టర్ బాల్లెలు విజయ్, అరుట్ల తిరుపతి, సద్ది మధు, మల్లేష్, మహేష్, వివేక్, బుచ్చయ్య, గోడయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు