కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి ఉత్తరయ్య హాట్స్,కొమురయ్య హాట్స్, అంబేద్కర్ హాట్స్, బస్తీలలో బస్తి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్తివాసులు డ్రైనేజ్, రోడ్లు,మంచినీరు సదుపాయం, దోమల బెడద, నల్లాలు, ఈ సమస్యలు అన్ని ఎమ్మెల్యేకి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలపరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బస్తీలో మంచినీరు ట్యాంక్ పగిలిపోవడంతో ఎమ్మెల్యే పరిశీలించి వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి కొత్త ట్యాంకు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఉత్తరయ్య హట్స్ బస్తీ వాసి ప్రమాదవశాత్తు కాళ్లు పడిపోవడంతో మంచానికి పరిమితమయ్యారు వారిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించి, వైద్యం కోసం గాంధీ సూపర్డెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు…



