తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోపిడీకి గురిచేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని బిఆర్ఎస్ రాక్షస పాలనను అంతమొందించి, ప్రజా పాలనను తీసుకొచ్చిన ప్రజా బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సీఎం జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ చౌక్ లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కోసి పంచి పెట్టారు. నగరంలోని సుప్రసిద్ధ కరీముల్లా షా సాహెబ్ ఖాద్రి రహమతుల్లా అలైహి దర్గాలో ప్రార్థన నిర్వహించారు. నగర కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభినందనీయమన్నారు. బిఆర్ఎస్ అవినీతి పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన ఘనత, నాటి రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు సమగ్ర కుటుంబ సర్వేలో కాంగ్రెస్ కార్యకర్తలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకు అధికారులకు సమన్వయకర్తలుగా సేవలందించాలన్నారు. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో 60 మందికి పైగా నగర కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. సీఎం జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సేవా కార్యక్రమాలను మొక్కవోని దీక్షతో కర్తవ్య బాధ్యతతో ముందుండి పాల్గొన్నటువంటి నగర కాంగ్రెస్ కమిటీ నాయకులకు, కార్యకర్తలకు నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్,ఆకారపు భాస్కర్ రెడ్డి, చర్ల పద్మ, చాడగొండ బుచ్చిరెడ్డి, అర్ష మల్లేశం, కాషేట్టి శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, దండి రవీందర్, కల్వల రామచంద్రం, జిడి రమేష్, దన్న సింగ్, కీర్తి కుమార్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, ఊరడి లత, జ్యోతిరెడ్డి,హసీనా, మాసుం ఖాన్తది తరులు పాల్గొన్నారు.


