Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్.

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్లుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అరుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద సుమారుగా 30,00,000/- రూపాయల విలువ గల 216 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక అవసరాల కోసం అధిక మొతంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపే వారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి డయల్ 100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ గారు కోరినారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు. చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments