హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రతినిత్యం వందలాదిమంది ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో వాకర్స్ తో కలిసి మాట ముచ్చట పెట్టారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ డ్రైనేజీ తో పాటు ట్రాక్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా లైటింగ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ప్రణవ్ బాబు ప్రజల సౌకర్యార్థం ట్రాక్ ని ఏర్పాటు చేస్తామని డ్రైనేజీ తో పాటు లైటింగ్ సమకూర్చుతానని హామీ ఇచ్చారు…