సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసగించిన బిజెపిని ఓడించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గెడం టీకానంద్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా లోని డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోడీ దేశ యువతకు ఇచ్చిన మాట విస్మరించారు పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి అన్ని ప్రజల వర్గాలను మోసం చేసింది ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానే సంగతి మర్చిపోయారు పకోడీలు అమ్ముకోవడం కూడా యువతకు ఉద్యోగం లాంటిదే అన్ని దేశ యువతని అవమానించారు. స్కిల్ ఇండియా మేకింగ్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియా ఆనే మోసపూరిత నినాదాలతో ప్రజలను మభ్యపెట్టి, మోడీ పాలనలో భారత్ లో ఎక్కువగా నిరుద్యోగం పెరిగిందన్నారు. మోడీ పాలనలో భారతదేశంలోనే ప్రతి పౌరుడికి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు భారం పడింది అని విద్యా ఉపాధి ఉద్యోగ కల్పనకు చర్యలు చేపట్టకుండా కుల మత రాజకీయాలు చేసి ఓట్లు అడిగి అధికారంలో రావడం కోసం చూస్తూ ఉన్నది, రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు దేశ రక్షణకు రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కుల కోసం బిజెపిని ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడీ పురుషోత్తం శ్రావణి సహాయ కార్యదర్శి ఆత్మకూరు సతీష్ నాయకులు శ్రీకాంత్, నిఖిల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు