రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారు కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం బుధవారం వీర్నపల్లి మండలం బావ సింగ్ తండా కు చెందిన భూక్య సతీష్ (24), భూక్య సాయిరాం ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు ఈ క్రమంలో ముందు వెళుతున్న కారుని ఓవర్టేక్ చేస్తుండగా అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను బైక్ ఢీ కొట్టింది దీంతో భూక్య సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు సాయిరాంకి త్రీవ గాయాలు కాగా సిరిసిల్ల లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు