ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజా రాజేశ్వర స్వామిని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మోడీకి ఘన స్వాగతం పలికారు శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడలో జరగనున్న భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. భారీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని కేవలం ఐదు లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉందని బండి సంజయ్ తెలిపారు మోడీపై కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం వాక్యాలు చేస్తే సహించబోమని వేములవాడ సభలో పేర్కొన్నారు ఆరడుగుల బుల్లెట్ అని అన్నారు మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ తెరిపించారని వ్యాఖ్యానించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 12 వేల కోట్లు నిధులు మోడీ ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు. సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయిందని ప్రధాని మోదీ అన్నారు కాంగ్రెస్ ఇక్కడ ఎవ్వరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు బి ఆర్ ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు పీవీ నరసింహారావు కి భారతరత్న ప్రకటించి బిజెపి గౌరవించిందని తెలిపారు బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు