విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతినగర్ చౌరస్తా వద్ద కార్పొరేటర్ గందె మాధవి మహేష్ ఏర్పాటు చేసిన శమీ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కు కార్పొరేటర్ గందె మాధవి మహేష్ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానం చేసినారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై వుండాలని ప్రజలు అందరూ ఆయు ఆరోగ్యాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు మహిళలు పాల్గొన్నారు

