గత ప్రభుత్వం కృష్ణ జలాలను దోపిడీ చేసి తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసిందని జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కెసిఆర్ నల్లగొండ కృష్ణా జలాల మీద బహిరంగ సభ ను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో సోమవారం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని మర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు జిల్లా మైనార్టీల అధ్యక్షులు ఎస్కే సాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మరి నారాయణరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు గోగురు శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, పందిర్ల సుధాకర్ గౌడ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల నారా గౌడ్, పందిర్ల సుధాకర్ గౌడ్, పాశం నాగిరెడ్డి, నర్ర భగవంతు రెడ్డి, ఎన్నారై లాల, గుర్రాల మల్లారెడ్డి, బండి పరశురాములు పాల్గొన్నారు