రెండేళ్లలో భోగాపురం ఏర్ పోర్ట్ ను కూటమి ప్రభుత్వం నిర్మించి తీరుతుందని సిఎం చంద్రబాబు స్పష్ఠం చేశారు. విజయనగరం జిల్దా భోగాపురం ఏర్ పోర్ట్ నిర్మాణ పనులను సిఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం జీఎంఆర్ ఏర్పాటు చేసిన ఏర్ పోర్ట్ లాంజ్ లో సిఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2024 జూన్ నాటికి ఏర్ పోర్ట్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ నెలలోనే భోగాపురం ఏర్ పోర్ట్ ను ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో అంటే 2014లోనే టీడీపీ ప్రభుత్వమే ఏర్ పోర్ట్ కు స్థలం కేటాయించిందన్నారు. గడచిన అయిదేళ్లలో భూమూలిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వడంలో గత ప్రభుత్వ హయాంలో కాస్త జాప్యం జరిగిందని సిఎం చంద్రబాబు అన్నారు. అసలు కేటాయించిన భూములలో కొంత భూమిని మాత్రమే ఏర్ పోర్ట్ కు గత ప్రభుర్వం వినియోగించిందన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మిగిలిన భూమిని కూడా ఏర్ పోర్ట్ కే కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటామని సిఎం చంధ్రబాబు స్పష్ఠం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్ఠర్ డా బీ. ఆర్. అంబేధ్కర్, విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ, ఎస్పీ దీపిక లు పాల్గొన్నారు.
జూన్ 2026లో భోగాపురం ఏర్ పోర్ట్ ప్రారంభిస్తాం: చంద్రబాబు….!
RELATED ARTICLES