ఎల్లారెడ్డి పేట ఎంపిడిఓ గా నూతనంగా విధుల్లో చేరిన సత్తయ్య ను గురువారం స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సత్తయ్య పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసి ఎల్లారెడ్డి పేట ఎంపిడిఓ గా బదిలీపై వచ్చారు. సత్తయ్య ఎల్లారెడ్డి పేట, నారాయణపూర్ గ్రామాలకు ప్రత్యేకాధికారి గా పనిచేయనున్నారు. ఎల్లారెడ్డి పేటలో గల సమస్యలను ఎంపిడిఓ సత్తయ్య కు వివరించారు.