Sunday, April 27, 2025
spot_img
HomeCINEMAఅవకాశాల కోసం ఎదురుచూపులు!

అవకాశాల కోసం ఎదురుచూపులు!

ఇటీవల తమిళ దర్శక హీరో ప్రదీప్‌ రంగనాథన్‌, ఇవానా జంటగా నటించిన చిత్రం ‘లవ్‌టుడే’. కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇటీవలే తెలుగులోనూ విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్‌గా తన నటనతో ప్రేక్షకులను ఇవానా మెప్పించగలిగింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటించేందుకు ప్రాధాన్యత ఇస్తూ.. సినీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

గతంలో బాలా దర్శకత్వం వహించిన ‘నాచ్చియార్‌’ చిత్రంలో హీరో కమ్‌ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ సరసన ఇవానా నటించారు. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ‘లవ్‌టుడే’ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఇవానా పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. పైగా కోలీవుడ్‌లో ఉన్న చిన్న వయస్సు హీరోయిన్‌ ఇవానానే కావడం గమనార్హం. కాగా ఈ బ్యూటీ సొంత రాష్ట్రం కేరళ. అయితే అక్కడి కంటే తమిళనాడులోనే నటిగా సెటిల్ అయ్యిపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments