బుధవారం రోజున ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన రామ్ కనకమ్మ 75 సంవత్సరాలు రామ్ బోషయ్య 80 సంవత్సరాల వృద్ధ దంపతులు నాగారం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా రామ్ కనకమ్మ అనారోగ్యం పాలై మంచానీకె పరిమితమయింది. ఇట్టి క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో పడుకొని ఉన్న వృద్ధ దంపతుల మీద వీధి కుక్కలు ఒకసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో రామ్ కనకమ్మ కాలుకు పెద్ద గాయాలయ్యాయి. ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు జమ్మికుంట 108 అంబులెన్స్ సర్వీస్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ సర్వీస్ నాగారం గ్రామానికి చేరుకొని ప్రధమ చికిత్స చేసిన అనంతరం వృద్ధ దంపతులను హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమ్మికుంట 108 అంబులెన్స్ EMT బద్రీనాథ్ పైలెట్ రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు మెరుగైన వైద్యం కొరకు వరంగల్ ఎంజీఎం కు తరలించే అవకాశం ఉందని తెలిపారు…